బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన సినిమా డంకీ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమాలో తాప్సీ హీరోయిన్ గా నటించింది.
ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు రిలీజ్ అయింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. షారుఖ్ ఖాన్, తాప్సీ,బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ తదితరులు
దర్శకత్వం.. రాజ్ కుమార్ హిరానీ
బ్యానర్స్.. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్
నిర్మాతలు.. హిరానీ, గౌరీ ఖాన్
సినిమాటోగ్రఫి.. సి.కె.మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్
సంగీతం – ప్రీతమ్, అమన్ పంత్
కథ
పంజాబ్ లోని లల్టు గ్రామం. ఆ గ్రామంలో మను(తాప్సి), బుగ్గు(విక్రమ్ కొచ్చర్), బల్లి(అనిల్ గ్రోవర్) ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురూ ఎలాగైనా లండన్ వెళ్లి డబ్బులు సంపాదించాలనుకుంటారు. మరోవైపు హార్డీ(షారుఖ్ ఖాన్) తనను కాపాడిన మను అన్నయ్యను ఒకసారి కలుద్దామని.. థ్యాంక్స్ చెబుదామని పఠాన్ కోట్ నుండి లల్టు గ్రామానికి వస్తాడు హృదయ్ సింగ్ అలియాస్ హార్డీ (షారుక్ ఖాన్). అక్కడ మను అన్నయ్య చనిపోయాడని తెలుసుకుంటాడు. దాంతో వీళ్ళ ఆర్ధిక బాధలు చూసి వీరిని ఎలాగైనా లండన్ పంపాలి అనుకుంటాడు. ఈనేపథ్యంలోనే ఇంగ్లీష్ నేర్పిస్తాడు. అయితే వీరి ముగ్గురిలో బల్లి కి మాత్రమే వీసా వస్తుంది. దీంతో ఎలాగైనా ఇంగ్లాండ్ వెళ్ళాలి అని షారుఖ్, మిగిలిన వాళ్లంతా ఫిక్స్ అవుతారు. అలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా డంకీ రూట్ లో దేశాలు దాటుకుంటూ వెళదామని ఫిక్స్ అవుతారు. ఇక షారుఖ్, మిగిలిన వాళ్లంతా అక్రమంగా దేశాలు దాటుకుంటూ ఇంగ్లాండ్ ఎలా వెళ్లారు? ఆ క్రమంలో వాళ్ళు ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి? అనేది ఈ సినిమా కథ.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ రెండు వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవడమే కాదు రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ అందించాయి. ఇక ఇప్పుడు మూడో సినిమా డంకీ వస్తుండటంతో అందరి చూపు ఈసినిమాపై పడింది. ఈసినిమాతో షారుఖ్ హ్యాట్రిక్ కొడతాడా లేదా అని ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్.
డంకీ అంటే అక్రమ వలస అని అర్థం. పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో డంకీ పద్దతి ద్వారా అక్రమ వలసలు వెళ్లే ఘటనలు చూస్తుంటాం. ఇక ఈ పాయింట్ నే తీసుకొని రాజ్ కుమార్ హిరానీ ఈసినిమాను తెరకెక్కించాడు. అయితే మరీ సీరియస్ మోడ్ లో కాకుండా కాస్త కామెడీని కూడా జోడించాడు. ఫస్ట్ హాఫ్ అంతా లండన్ వెళ్లడానికి చేసే ప్రయత్నాలు, షారుఖ్ ఎంట్రీ, ఇంగ్లీష్ పాఠాలతో వచ్చే కామెడీతో సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో మనసుని హత్తుకునే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అక్రమ వలసల కష్టాలు మనసుని కదలిస్తాయి. లండన్ లో వచ్చే కోర్ట్ సీన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
పెర్ఫామెన్స్
షారుఖ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఎప్పటిలాగే షారుఖ్ హార్డీ పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నాడు. కామెడీ సన్నివేశాల్లో ఎలాగైతే నవ్వించాడో.. ఎమోషనల్ సీన్లలో అలానే కంటతడి పెట్టించాడు. అంతేకాదు 50 ఏళ్ళ వయసు పాత్రలో కూడా షారుఖ్ మెప్పిస్తాడు. ఇక హీరోయిన్ గా చేసిన తాప్సీ తన పాత్ర మేర బాగానే చేసింది. తను కూడా యంగ్, ముసలి పాత్రలో ఎమోషన్ తో మెప్పిస్తుంది. విక్కీ కౌశల్ నిడివి చిన్నదే అయినా ఉన్నంతలో తమ ఎమోషన్ తో ఆకట్టుకున్నాడు. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్, బొమన్ ఇరానీ తమపాత్రల మేర బాగానే నటించారు.
టెక్నికల్ వాల్యూస్
షారుఖ్ సినిమా అందులోనూ టాప్ బ్యానర్స్ కాబట్టి నిర్మాణ విలువలకు ఎలాంటి ఢోకా లేదు. ప్రతి ఫ్రేమ్ లోనూ రిచ్ నెస్ కనిపిస్తుంది. ఇంకా సంగీతం, సినిమాటోగ్రఫి కూడా ఈసినిమాకు ప్రధాన బలమయ్యాయి. ముఖ్యంగా సంగీతం ప్రతి సీన్ ను మరింత హైలెట్ చేశాయి. అలానే సినిమాటోగ్రఫి కూడా బాగుంది.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కామెడీ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల వారు ఈసినిమాను ఓసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























