విజయ్ బిన్ని దర్శకత్వంలో కింగ్ నాగార్జున అక్కినేని హీరోగా వస్తున్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ఈసినిమా చాలా సైలెంట్ గా సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ న రీసెంట్ గానే రిలీజ్ చేశారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌లో నాగార్జునతో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ చివరి దశలోకి వచ్చేసింది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా షూట్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో నా సామిరంగ టైటిల్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ఈ మాస్ నంబర్‌లో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా అలరించనున్నారు. సినిమాకే పెద్ద ఆకర్షణగా నిలవనున్న ఈ పాట చిత్రీకరణలో 300 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
కాగా ఈసినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈసినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: