సెన్సార్ కంప్లీట్ చేసుకున్న డెవిల్

kalyanram devil movie completes censor formalities

నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ నేపథ్యంలో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి. ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు మరింత పెంచుతున్నారు మేకర్స్. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మరోవైపు పాటలను కూడా వరుసగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాాలను కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ ను అందించారు. సెన్సార్ బృందం నుండి ఈసినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 11 =