NBK 109 ఊటీ షెడ్యూల్ కంప్లీట్

NBK 109 movie ooty Schedule Wrapped

నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించినా రీసెంట్ గానే షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈసినిమా షూటింగ్ గురించి మరో అప్ డేట్ వచ్చింది. గత కొద్దిరోజులుగా ఈసినిమా ఊటీలో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈనేపథ్యంలో అక్కడి షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తుంది. వింటర్ కారణంగా అక్కడ వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో అక్కడు షూటింగ్ ను ఆపేసినట్టు తెలుస్తుంది. ఇక తరువాత షెడ్యూల్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరపనున్నట్టు సమాచారం.

కాగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కాగా చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాకి దర్శకత్వాన్ని వహించిన బాబీ ఈ సినిమాకి దర్శకుడు కావడంతో ఇప్పుడు బాలయ్య సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =