ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. తెలుగు సూపర్ హీరో సినిమాగా ఈసినిమా వస్తుండటం.. అందులోనూ ప్రశాంత్ మేకింగ్ అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ రేసులో దిగనుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్ తోనే సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేశాడు ప్రశాంత్ వర్మ. ఇక ఈసినిమా ట్రైలర్ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తుండగా నిన్న ఎన్నో అంచనాల మధ్య ట్రైలర్ రిలీజ్ అయింది. అంచనాలకు తగ్గట్టే ట్రైలర్ ఉండటంతో సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ముఖ్యంగా విజువల్స్ ప్లస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రశాంత్ వర్మ బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి టైమ్ తీసుకుంటున్నట్టు చెప్పగా.. ట్రైలర్ లో దాని ఫలితం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హనుమాన్ ట్రైలర్ సాలిడ్ వ్యూస్ తో సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండింగ్ అవుతుంది.
Captivating every heart from Akhand Bharat to allover the world ❤️🤗#HanumanTrailer hits 1️⃣5️⃣ MILLION+ Views with 800K+ Likes and TRENDING TOP on YouTube 📈🔥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123#HANUMAN In WW Cinemas from JAN 12, 2024 💥… pic.twitter.com/c2b2S7BHsQ— Primeshow Entertainment (@Primeshowtweets) December 20, 2023
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: