వ‌ర్మ ‘వ్యూహం’ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోన్న దిల్ రాజు

Dil Raju to be Released RGV's Vyooham in Nizam on December 29th

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ‘వ్యూహం’, ‘శ‌ప‌థం’ అనే సినిమాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు కూడా వర్మ 2014 అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో.. ‘పవర్ స్టార్’, ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ మరియు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తదితర చిత్రాలను తీసిన విషయం గుర్తుండే ఉంటుంది. పొలిటికల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాలను రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ నేపథ్యంలో ‘వ్యూహం’ సినిమా డిసెంబ‌ర్ 29న గ్రాండ్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్‌డేట్‌ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీని ప్రకారం.. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు విడుదల చేయడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు విషయాన్ని రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గురువారం దిల్ రాజుని కలిసిన ఫోటోను షేర్ చేసిన వర్మ.. ప్రొడ్యూసర్‌కి అభినందనలు తెలిపారు. కాగా ఈ సినిమా ఇటీవలే సెన్సార్ చిక్కులను అధిగమించింది. ఈ మూవీపై వచ్చిన కొన్ని అభ్యంతరాల మేరకు తొలుత సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించిన బోర్డు కొన్ని సూచనలతో చివరికి ‘యూ’ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ క్రమంలో మేకర్స్ వ్యూహం సినిమాను డిసెంబర్ 29న విడుదల చేయడానికి నిర్ణయించారు.

కాగా ఈ రెండు సినిమాల ద్వారా రామ్‌గోపాల్‌ వ‌ర్మ‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏర్పడ్డ పరిస్థితులు మరియు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తదితర సంఘటనలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను, వైఎస్ జగన్ రాజకీయ శక్తిగా ఎదగడం వంటి కొన్ని కీలక ఘట్టాలను చూపించనున్నారు. ఇక ఈ సినిమాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. ఆయన సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస రాధా కృషన్ కనిపించనున్నారు. అయితే మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రామ్‌గోపాల్‌ వర్మ ఇలా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌ చిత్రాలను రిలీజ్ చేయనుండటం ఆసక్తికరంగా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 16 =