నైజాంలో సలార్‌ బెనిఫిట్‌ షోలు ప్రదర్శించబడే థియేటర్లు ఇవే..

Salaar Benefit Shows: List of Theaters in Telangana

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ‘సలార్’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా తొలిభాగం ‘సలార్: పార్ట్ 1-సీజ్ ఫైర్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఒక శుభవార్త అందింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా టికెట్‌ రేట్ల పెంపుకు అనుమతి లభించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీని ప్రకారం.. నిబంధనల మేరకు మొదటివారం టికెట్‌ ధరలు పెంచుకునేందుకు నిర్మాతలకు వెసులుబాటు కలిగింది. దీనితోపాటు నైజాంలో హైదరాబాద్‌ సహా ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో మొత్తం 20 థియేటర్లలో అర్థరాత్రి 1 గంటకు బెనిఫిట్‌ షోలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాంలో ‘సలార్‌’ బెనిఫిట్‌ షోలు ప్రదర్శించబడే థియేటర్ల లిస్ట్

హైదరాబాద్

  • సంధ్య 70 ఎమ్ఎమ్ థియేటర్ – ఆర్టీసీ క్రాస్ రోడ్స్
  • సంధ్య 35 ఎమ్ఎమ్ థియేటర్ – ఆర్టీసీ క్రాస్ రోడ్స్
  • ఏఎంబీ సినిమాస్ – గచ్చిబౌలి
  • భ్రమరాంబ థియేటర్ – కూకట్ పల్లి
  • మల్లికార్జున థియేటర్ – కూకట్ పల్లి
  • అర్జున్ థియేటర్ – కూకట్ పల్లి
  • విశ్వనాథ్ థియేటర్ – కూకట్ పల్లి
  • నెక్సస్ మాల్- కూకట్ పల్లి
  • శ్రీరాములు థియేటర్ – మూసాపేట
  • గోకుల్ థియేటర్ – ఎర్రగడ్డ
  • రాజధాని డీలక్స్ – దిల్‌సుఖ్ నగర్
  • శ్రీసాయిరాం థియేటర్ – మల్కాజిగిరి

తెలంగాణలోని ఇతర జిల్లాల థియేటర్లు ఇవే..

  • ఎస్‌వీసీ తిరుమల – ఖమ్మం
  • వినోద్ థియేటర్ – ఖమ్మం
  • నటరాజ్ థియేటర్ – నల్గొండ
  • రాధిక థియేటర్ – వరంగల్
  • వెంకటేశ్వర థియేటర్ – కరీంనగర్
  • ఎస్‌వీసీ విజయ – నిజామాబాద్
  • శ్రీనివాస థియేటర్ – మహబూబ్ నగర్
  • వెంకటేశ్వర థియేటర్ – మహబూబ్ నగర్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 14 =