ఫైనల్లీ ఊరు పేరు భైరవకోన రిలీజ్ డేట్ ఫిక్స్

Ooru Peru Bhairavakona Official Release Date

టాలీవుడ్ లో కాస్త వైవిధ్యమైన సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకరు. అయితే సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేస్తున్నా మంచి విజయాలు మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇక ఏడాది మైఖేల్ తో వచ్చినా ఆ సినిమా కూడా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన అనే డిఫరెంట్ కథతో వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా.. టీజర్ అయితే సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అయితే ఈసినిమా రిలీజ్ డేట్ ను మాత్రం ఇంతవరకూ చెప్పలేదు మేకర్స్. దీంతో ఫ్యాన్స్ ఈసినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను వచ్చేఏడాది ఫిబ్రవరి9 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ఈసినిమాలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్‌, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్‌ బ్యానర్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.