
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 226


బాలీవుడ్‌లో దుమ్ము రేపుతున్న హనుమాన్

హనుమాన్ 5డేస్ కలెక్షన్స్

హనుమాన్ టీమ్‌ని అభినందించిన నందమూరి బాలకృష్ణ

నాకు ఇమిటేట్ చేయడం బాగా వచ్చు-మహేష్

గుంటూరు కారం బీడీ సీక్రెట్ చెప్పిన మహేష్

100 కోట్ల క్లబ్ లో చేరిన హనుమాన్

హనుమాన్‌పై రామ్ పోతినేని స్పెషల్ రివ్యూ

మరోసారి రిలీజ్ డేట్ మార్చుకున్న తంగలాన్

రాజా సాబ్ గా వస్తున్న ప్రభాస్

ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ సింగిల్ వందేమాతరం సాంగ్ రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. నిజానికి ఈసినిమా కూడా గత ఏడాడి డిసెంబర్ లోనే రిలీజ్ చేయాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యంగా ముగియడం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేసుకున్నారు. ఫైనల్ గా ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ఈముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు.

బాలీవుడ్‌లో దుమ్ము రేపుతున్న హనుమాన్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన 'హనుమాన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే ప్రీమియర్స్ తోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ పండుగకు మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'గుంటూరు కారం', వెంకటేష్-శైలేష్ కొలను తీసిన 'సైంధవ్', నాగార్జున-విజయ్ బిన్నీ కాంబోలో రూపొందిన 'నా సామిరంగ' సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నా.. వాటిని తట్టుకుని మరీ హనుమాన్ సూపర్ హిట్ అవ్వడం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.

హనుమాన్ 5డేస్ కలెక్షన్స్
హనుమాన్ జోరు ఇప్పట్లో ఆగేలాలేదు.చిన్న సినిమాగా సంక్రాంతి పోటీలో దిగి ఊహించని వసూళ్లను రాబట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద హావ కొనసాగిస్తోంది.నిన్నఈసినిమా 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసి సాలిడ్ హోల్డ్ ను కొనసాగించింది.దాంతో 5రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 114కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇందులో షేర్ 60కోట్లు.ఇక30 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈసినిమా 5రోజుల్లోనే అంతకు రెట్టింపు కలెక్ట్ చేసి డబుల్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.

హనుమాన్ టీమ్‌ని అభినందించిన నందమూరి బాలకృష్ణ
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన తాజా చిత్రం 'హనుమాన్'. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బరిలో అగ్రహీరోల చిత్రాలున్నప్పటికీ అద్భుతమైన కంటెంట్‌తో అంచనాలకు మించి హిట్ అయింది.

నాకు ఇమిటేట్ చేయడం బాగా వచ్చు-మహేష్
ఎంతోకాలంగా వెయిట్ చేసిన మహేష్ గుంటూరు కారం సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జనవరి12వ తేదీన రిలీజ్ అయి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈసినిమాలో మహేష్ మాస్ విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. మహేష్ డైలాగ్ డెలివరీ, మేకోవర్, డ్యాన్స్ తో వన్ మ్యాన్ షో చేశాడు. ఇక ఈసినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా కీలక పాత్రల్లో జయరాం, రమ్యకృష్ణ, జగపతి బాబు, సునీల్, ఈశ్వరి రావు, రఘుబాబు నటించారు.

బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా నా సామిరంగ సాలిడ్ కలెక్షన్స్
మొత్తానికి ఈసంక్రాంతికి కూడా మంచి హిట్ ను అందుకున్నాడు కింగ్ నాగార్జున. సంక్రాంతి తనకు కలిసొస్తుందని మరోసారి ఈసినిమా నిరూపించింది. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అయి హిట్లను అందించాయి. ఇక ఈ మధ్య కాలంలో ఒకటి రెండు సినిమాలు వచ్చినా అవి సరైన విజయాన్ని అందించలేకపోయాయి. ఇప్పుడు నా సామిరంగ సినిమాతో వచ్చాడు. మాస్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా డీసెంట్ హిట్ ను ఇచ్చింది. నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

నాన్నా నువ్వు నా ప్రాణం- అకీరా మరో సూపర్ కంపోజిషన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. బయట పెద్దగా కనిపించకపోయినా తన టాలెంట్స్ తో మాత్రం ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతూనే ఉంటాడు. ఇక ఈసారి మరోసారి అకీరా నందన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు సంగతేంటంటే.. ఏ పండగనైనా మెగా ఫ్యామిలీ ఎలాా సెలబ్రేట్ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిగిలిన సమయాల్లో ఎలా ఉన్నా పండుగ సమయాల్లో మాత్రం మెగా, అల్లు ఫ్యామిలీ ఇరు కుటుంబసభ్యులు కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. అలా సంక్రాంతికి అందరూ ఒకచోట చేరి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.

ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు.. చిరు, నాగబాబు సెల్ఫీ వైరల్
తెలుగునాట సంక్రాంతి పండుగకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. విద్య, ఉద్యోగ, జీవనోపాధికోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినవారంతా ఈ పండుగ వేళ సొంతూర్లకు చేరుకోవడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సాధారణ ప్రజలతోపాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ పండుగను అద్భుతంగా జరుపుకున్నారు. ఇక ప్రతి పండుగను వేడుకలా సెలబ్రేట్ చేసుకోవడం మెగా ఫ్యామిలీకి అలవాటన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వారు సంక్రాంతి పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు. బెంగుళూరులోని ఫాంహౌస్‌లో మెగా ఫ్యామిలీ ఈ పర్వదినాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

గుంటూరు కారం బీడీ సీక్రెట్ చెప్పిన మహేష్
సూపర్ స్టార్ హీరోగా వచ్చిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా హిట్ టాక్ ను అయితే సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహేష్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంటుంది.

సినిమా రిజల్ట్ పై హరీష్ శంకర్-రవితేజ ఫన్నీ సంభాషణ
మాస్ మహారాజాా రవితేజ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది మూడు సినిమాలతో వచ్చిన రవితేజ ఈ ఏడాది పలు సినిమాలను లైన్ లో పెట్టాడు. ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా ఈగల్. ఈసినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాలి కానీ వాయిదా పడింది. ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు.

100 కోట్ల క్లబ్ లో చేరిన హనుమాన్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా హనుమాన్ . హనుమంతుడి స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమా ఇప్పుడు ఎంత ప్రభంజన సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈసినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వారివరకూ అందరూ ఈసినిమా కోసం బ్రహ్మరధం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ మేకింగ్, తేజ సజ్జా నటన ఈసినిమాకు హైలెట్ గా నిలిచాయి.

హనుమాన్‌పై రామ్ పోతినేని స్పెషల్ రివ్యూ
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన తాజా చిత్రం 'హనుమాన్'. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి హిట్ అయింది. బరిలో హేమాహేమీలు వంటి అగ్రహీరోల చిత్రాలున్నప్పటికీ అద్భుతమైన కంటెంట్‌తో సత్తా చాటింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ విడుదలైన ప్రతిచోటా అదిరిపోయే కలెక్షన్స్‌తో దుమ్మురేపుతోంది. ఈ క్రమంలో తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించి, ఆపై 4వ రోజునే…

3M డాలర్ క్లబ్ లో హనుమాన్.. టాప్ 10 మూవీస్ లో ప్లేస్
భారీ హైప్ తో రిలీజ్ అయి బోల్తా కొట్టే సినిమాలు కొన్ని ఉంటాయి.. అలానే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లను అందుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. అలా ఈ సంక్రాంతికి వచ్చిన సినిమానే హనుమాన్. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడంతో ఫైనల్ గా సంక్రాంతికి పండుగ సందర్బంగా జనవరి 12వ తేదీన రిలీజ్ చేశారు. ఇక అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం కూడా రిలీజ్ అయింది. అయితే రిలీజ్ కు ముందే చాలా కంపారిజన్స్ వచ్చాయి. కానీ అలాంటివి ఏం పట్టించుకోకుండా సినిమాను రిలీజ్ చేశారు హనుమాన్ మేకర్స్.

గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్.. మహేష్ బాబు ఇంట్లో తారల సందడి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, 'గురూజీ' త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. శ్రీలీల ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేయగా.. మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించింది. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్, మురళీశర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇక రిలీజ్ ముందే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా.. అందుకు తగ్గట్లే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

మరోసారి రిలీజ్ డేట్ మార్చుకున్న తంగలాన్
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా వస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ముగించుకుంటుంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ట్రెండింగ్‌లో.. విశ్వంభర గ్లింప్స్ అండ్ కాన్సెప్ట్ వీడియో
మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రానికి 'విశ్వంభర'గా టైటిల్ ఖరారైన విషయం తెలిసిందే. సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు 'బింబిసార'తో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా నిన్న చిత్ర యూనిట్ 'విశ్వంభర' టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేసింది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో కూడిన ఈ వీడియో సినిమాపై ఆసక్తిని అమాంతంగా పెంచేయగా.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

నా సామిరంగ 2 డేస్ క్రేజీ కలెక్షన్స్
ఈ సంక్రాంతికి కూాడా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అందులో కింగ్ నాాగార్జున హీరోగా వచ్చిన నా సామిరంగ మూవీ కూడా ఒకటి. బిన్ని విజయ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా నా సామిరంగ. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. చాలా కాలం తరువాత మాస్ రోల్ తో వచ్చిన నాగ్ మరోసారి తన సత్తా చూపించాడు. స్నేహం, ప్రేమ, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అవుతుంది.

కంగువ సెకండ్ లుక్ పోస్టర్ రిలీజ్.. స్టన్నింగ్ స్టిల్‌లో సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'కంగువ'. ప్రముఖ తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య పలు గెటప్స్‌లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 3డీ ఫార్మాట్‌లో కూడా విడుదలవనుండటం గమనార్హం.

రాజా సాబ్ గా వస్తున్న ప్రభాస్
బాహుబలి సిరీస్ తరువాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. అయితే ఆ సిరీస్ తరువాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాలు కూడా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయాయి. ఇక రీసెంట్ గా సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి.

సలార్, దేవర, పుష్ప 2 సహా.. 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ లిస్ట్
మకర సంక్రాంతి పండుగ సందర్భంగా.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తెలుగు సినీ ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్ అందించింది. ఈ యేడాది తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మోస్ట్ ఎక్సయిటింగ్ అండ్ అవైటెడ్ తెలుగు మూవీస్ లైనప్ లిస్ట్‌ని ప్రకటించింది. వీటిలో పలువురు టాలీవుడ్ అగ్ర హీరోల ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు సహా మొత్తం 12 సినిమాలు ఉండటం గమనార్హం. ప్రభాస్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, నాని, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, కార్తికేయ గుమ్మకొండ తదితర హీరోల చిత్రాలు ఉన్నాయి.