సలార్‌, దేవర, పుష్ప 2 సహా.. 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ లిస్ట్

Salaar Devara Pushpa 2 and 9 other Exciting Telugu Movies to Stream in Netflix For 2024, Salaar, Devara, Pushpa 2, Telugu Movies For 2024, Lineup Of Telugu Movies, OTT Giant Netflixs, Netflixs Stellar Lineup, Netflixs Movies, Netflixs Movies 2024, OTT Movies 2024, OTT Movies, New OTT Movies, Latest Tollywood Updates, Telugu Film News 2023, Tollywood Movie Updates, Telugu Filmnagar

మకర సంక్రాంతి పండుగ సందర్భంగా.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ తెలుగు సినీ ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్ అందించింది. ఈ యేడాది తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మోస్ట్ ఎక్సయిటింగ్ అండ్ అవైటెడ్ తెలుగు మూవీస్ లైనప్‌ లిస్ట్‌ని ప్రకటించింది. వీటిలో పలువురు టాలీవుడ్ అగ్ర హీరోల ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు సహా మొత్తం 12 సినిమాలు ఉండటం గమనార్హం. ప్రభాస్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, నాని, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, కార్తికేయ గుమ్మకొండ తదితర హీరోల చిత్రాలు ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలకు సంబంధించిన డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా.. థియేట్రికల్ విడుదల తర్వాత ఈ 12 తెలుగు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని కీలక ప్రాజెక్టులు కూడా స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఇండియా వీపీ – కంటెంట్ మోనికా షెర్గిల్ తెలిపారు. భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు అత్యుత్తమ తెలుగు చిత్రాలని అందించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా షెర్గిల్ పేర్కొన్నారు.

నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన ఆ 12 చిత్రాలు ఏవంటే..?

  • హాయ్ నాన్న – నాని
  • సలార్‌ – ప్రభాస్
  • దేవర – జూ. ఎన్టీఆర్
  • పుష్ప 2 – అల్లు అర్జున్
  • NBK109 (వర్కింగ్ టైటిల్) – నందమూరి బాలకృష్ణ
  • VD12 (వర్కింగ్ టైటిల్) – విజయ్ దేవరకొండ
  • బడ్డీ – అల్లు శిరీష్
  • గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి – విశ్వక్ సేన్
  • యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.12 – కార్తికేయ గుమ్మకొండ
  • టిల్లు స్క్వేర్ – సిద్ధు జొన్నలగడ్డ
  • SVCC37 (వర్కింగ్ టైటిల్) – సిద్ధు జొన్నలగడ్డ
  • GA2 పిక్చర్స్ ప్రొడక్షన్ నెం 9
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =