విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా వస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ముగించుకుంటుంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ మరోసారి మారింది. ఈమధ్యే ఈసినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి26వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటంతో రిలీజ్ డేట్ ను మార్చి కొత్త అప్ డేట్ తో వచ్చారు. ఏప్రిల్ లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అయితే డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు.
History awaits to be written in blood and gold 🌟👑#ThangalaanFromApril2024#HappyPongal🌾 #HappyMakarSankranti🌞 @Thangalaan @chiyaan @beemji @GnanavelrajaKe #StudioGreen @officialneelam @parvatweets @MalavikaM_ @DanCaltagirone @gvprakash @NehaGnanavel @agrajaofficial… pic.twitter.com/fAEZkmpVp1
— Studio Green (@StudioGreen2) January 15, 2024
కాగా ఈసినిమాలో పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: