టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ‘గురూజీ’ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. శ్రీలీల ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేయగా.. మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించింది. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్, మురళీశర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇక రిలీజ్ ముందే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా.. అందుకు తగ్గట్లే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సినిమా మొత్తం మహేశ్ వన్ మ్యాన్ షోగానే నడించిందన్న ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా మహేశ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, మాస్ డ్యాన్స్.. అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దీంతో కలెక్షన్స్‌లో ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అనూహ్యంగా వచ్చిన నెగటివ్ టాక్‍ను తట్టుకుని మరీ భారీ వసూళ్లు కొల్లగొడుతూ.. సూపర్ స్టార్ స్టామినా ఏంటో నిరూపించింది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో మహేశ్ బాబు ఇంట ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
Happy Sankranthi!!!
Blockbuster celebrations 💥💥💥#GunturKaaram#DilRaju @vamsi84 @sreeleela14 @Meenakshiioffl pic.twitter.com/uxkDoEcjmj— Mahesh Babu (@urstrulyMahesh) January 15, 2024
సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగిన ఈ వేడుకలో చిత్ర యూనిట్ పాల్గొంది. ‘గుంటూరు కారం’ నిర్మాత నాగవంశీ సూర్యదేవర మరియు నైజాంలో ఈ సినిమాను పంపిణీ చేసిన దిల్ రాజు, ఆయన సతీమణి, సోయాదరుడు శిరీష్ విచ్చేసారు. ఇక ఈ చిత్రంలో నటించిన హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరి కూడా ఈ పార్టీలో సందడి చేయగా.. టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్, మరో దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె తదితరులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో హీరో మహేశ్ బాబు, ఆయన సతీమణి నమ్రత, వారి తనయ సితార వచ్చిన అతిథులతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Sankranthi Blockbuster success celebrations of #GunturuKaaram hosted by #SSMB @urstrulyMahesh @sreeleela14 @Meenakshiioffl @directorvamshi @vamsi84 @DilRajuOff_ @SVC_official @Shilpashirodkr pic.twitter.com/irUY3CPpMs
— Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) January 15, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: