గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల బుధవారం (ఫిబ్రవరి 14, 2024) ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక మధురమైన పోస్ట్‌ను తన అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్‌ను పెట్టారు. అందులో ఉపాసన, రామ్ చరణ్ మరియు కుమార్తె క్లిన్ కారా చేతులు ఉన్న ఒక స్నాప్‌ను షేర్ చేశారు. దీనికి రెడ్ హార్ట్ ఎమోటికాన్‌ను జోడించిన ఉపాసన, క్యాప్షన్‌లో ఇన్ఫినిటీ సింబల్‌ను పోస్ట్ చేశారు. వాలెంటైన్స్ డే వేళ ఉపాసన పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా రామ్ చరణ్, ఉపాసనలది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. ఇక ఈ దంపతులు గతేడాది తమ కుమార్తె క్లిన్ కారాకు స్వాగతం పలికారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
♾️❤️ pic.twitter.com/ZkNd6GeKwW
— Upasana Konidela (@upasanakonidela) February 14, 2024
కాగా ఇటీవలే ఉపాసన ఒక ఇంటర్వ్యూలో, తమ కుమార్తె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ప్రస్తుతం తల్లిదండ్రులుగా చరణ్, నేను ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాం. ఒక తల్లి ఏమి చేయాలని ఆశించినా, నాన్న దాని కంటే ఎక్కువ చేయగలడని నేను భావిస్తున్నాను. మేము క్లిన్ కారాను విషయంలో సమాన బాధ్యతలు పంచుకుంటున్నాం. అయితే తను నాన్న కూచి. నా దగ్గర ఉన్నంతసేపు తను హ్యాపీగానే ఉంటుంది. కానీ ఆమె తన తండ్రిని (చరణ్) చూడగానే, ఆమె ముఖం వెలిగిపోతుంది. ఆ సమయంలో పాప కళ్ళలో ఒక ప్రత్యేకమైన మెరుపు కనిపిస్తుంది. ఈ విషయంలో నాకు చాలా అసూయగా ఉంటుంది (నవ్వుతూ)” అని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























