సీక్వెల్స్ కు ఎప్పుడైనా క్రేజ్ ఎక్కువగా ఉంటుంది.ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సీక్వెల్ ఫై అంచనాలు పెరిగిపోతాయి.ఇప్పుడు టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ అయ్యింది.ఇదే ట్యాగ్ తో వస్తుంది టిల్లు స్క్వేర్.రెండేళ్ల క్రితం వచ్చిన డీజే టిల్లు చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బాస్టర్ అయ్యింది.స్టోరీ పక్కన పెడితే హీరోగా చేసిన సిద్దు జొన్నలగడ్డ యాక్టింగ్ యూత్ ను ఫిదా చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రెడీ అవుతుంది.రీసెంట్ గా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు అది సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక విడుదలకు నెలకుపైగా సమయం వున్నా నిన్ననే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అంచనాలకు తగ్గట్లుగానే ఉంది.సిద్దు తన బాడీ లాంగ్వేజ్ తో టిల్లు గా అదరగొట్టగా హిరోయిన్ గా నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ లిప్ లాక్ సీన్లతో బోల్డ్ గా కనిపించింది. యూట్యూబ్ లో ట్రైలర్ ఇప్పటివరకు 24గంటల్లో 4మిలియన్లకుపైగా వ్యూస్ ను రాబట్టుకుంది.
రిలీజ్ ముందు మరో ట్రైలర్ ను కూడా వదిలే ఆలోచనలో వున్నారు మేకర్స్.మల్లిక్ రామ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.మార్చి 29న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























