బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన సినిమా డంకీ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డంకీ పద్దతి ద్వారా అక్రమ వలసలు వెళ్లే వారి నేపథ్యం తీసుకొని ఈసినిమాను తెరకెక్కించారు. ఈసినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ప్రస్తుతానికి కేవలం హిందీలోనే అందుబాటులోకి వచ్చింది.
కాగా ఈసినిమాలో తాప్సీ హీరోయిన్ గా నటించగా.. బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యానర్స్ పై
హిరానీ, గౌరీ ఖాన్ నిర్మించారు. సి.కె.మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్ సినిమాటోగ్రఫి అందించగా.. ప్రీతమ్, అమన్ పంత్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























