గత ఏడాది నుండి టాలీవుడ్ లో రీ రిలీజ్ హడావుడి పెరిగిపోయింది.మొదట హీరోల బర్త్ డే లకు ఎక్కువ ఈ హడావిడి ఉండేది ఆ తరువాత కామన్ అయిపొయింది.కొత్త సినిమాల రిలీజ్ లేనప్పుడు రీ రిలీజ్ ముందుకు వస్తున్నాయి అయితే రీసెంట్ గా ఇది కొంచెం తగ్గింది కానీ నిన్న ప్రేమికుల దినోత్సవం కావడంతో రీ రిలీజ్ లు క్యూ కట్టాయి.ఒకటి కాదు రెండు కాదు నిన్న ఏకాంగా 5సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి ఇందులో అన్ని కల్ట్ సినిమాలుగా పేరు తెచ్చుకున్నవే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీటిలో ఏ సినిమాకు రాని రెస్పాన్స్ ఓయ్ కి వచ్చింది.నిన్న ఈసినిమా 1.50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది.రీ రిలీజ్ సినిమాల్లో ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా ఇదే.ఎలాంటి అసభ్యత లేకుండా పర్ఫెక్ట్ లవ్ స్టోరీ గా వచ్చిన వచ్చిన ఈచిత్రాన్ని యూత్ ఊహించని రీతిలో ఆదరించారు.
2009 లో ఓయ్ రిలీజ్ అయ్యింది.ఆనంద్ రంగ ఈసినిమాను డైరెక్ట్ చేయగా సిద్దార్థ్,షామిలి జంటగా నటించారు.ఓయ్ కల్ట్ అనే పేరుతెచ్చుకుంది కానీ కమర్షియల్ గా మాత్రం అంత సక్సెస్ అవ్వలేదు.యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ.సినిమాలో అన్ని పాటలు విశేష ఆదరణ పొందాయి.యూనివర్సల్ మీడియా బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: