అడివి శేష్ G2లో బాలీవుడ్ స్టార్

Emraan Hashmi Joins Adivi Sesh G2 Movie

టాలీవుడ్ యంగ్ హీరోలలో అడివి శేష్ శైలి వేరు. తనకు నచ్చిన పాత్ర కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురుచూడటం ఆయన నైజం. అలాగే నటించడంతో పాటు కథా రచనలోనూ అడివి శేష్ తన మార్క్ చూపుతాడు. సినిమా, సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకున్నా.. ఆయన మూవీ విడుదలవుతుందంటే హిట్ పక్కా అని ప్రేక్షకులు భావిస్తారంటే తన సినిమాల విషయంలో ఆయన ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. అడివి శేష్ ఇంతకుముందు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’ చిత్రాల ద్వారా అద్భుతమైన హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా అడివి శేష్ హీరోగా G2 అనే మూవీ తెరకెక్కుతోంది. గతంలో ఆయన నటించిన ‘గూఢచారి’ మూవీకి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. అందులో ఆల్ప్స్ పర్వతాలలో కథ ముగిసిన ప్రదేశం నుండి గూఢచారి పార్ట్ 2 ప్రారంభమవుతుంది. అడివి శేష్ స్వయంగా రచించి, నటించిన ‘మేజర్’ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కాగా జీ 2లో బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ అందించారు మేకర్స్.

ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా మేకర్స్ వెల్లడించారు. ఈ న్యూస్ తో G2 చిత్రంపై ఇటు పరిశ్రమలో అటు ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. కాగా ఇమ్రాన్ హష్మీ ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘టైగర్ 3’ చిత్రంలో తన విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇమ్రాన్ హష్మీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ సినిమాలో విలన్‌గా టాలీవుడ్ తెరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే.

‘కార్తికేయ 2’, ‘మేజర్’ వంటి హిట్ చిత్రాలను అందించిన నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గూఢచారి మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ G2ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 14 =