రాజేంద్ర ప్రసాద్ లేటు ప్రేమాయణం ల‌వ్‌@65

Rajendra Prasad And Jaya Prada New Movie First Look

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ నిర్మాణ సంస్థల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఒకటి. తక్కువ కాలంలోనే మంచి మంచి కాంబినేషన్స్ తో సినిమాలు చేసి తమ ఉనికిని గట్టిగా చాటుకుంది పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్. ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగా వైవిధ్య‌మైన క‌థా చిత్రాలను నిర్మిస్తూ…విజ‌యాలు సాధిస్తూ..అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను అన‌తి కాలంలోనే ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నారు. ఇక ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు తీస్తూనే మరోపక్క ఢిపరెంట్ సినిమాలను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. అలా వస్తున్న సినిమానే ల‌వ్‌@65.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వి.ఎన్‌.ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో రాజేంద్ర ప్రసాద్, జయప్రధ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. అర‌వై ఏళ్ల ఓ జంట మ‌ళ్లీ ఎలా ప్రేమ‌లో ప‌డింది? అనే పాయింట్ ని ఓ సోష‌ల్ మెసేజ్ మిక్స్ చేసి ఈ సినిమా ద్వారా చెప్ప‌బోతున్నారు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

కాగా ఈ సినిమాలో కార్తీక్ రాజు, సునీల్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + two =