యానిమల్- గ్లోబల్ ఛార్ట్ లో అదే హవా

ranbir kapoor animal movie mania continues on netflix

సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన వయోలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఈసినిమాలో మరోసారి తన సత్తా చూపించాడు సందీప్ వంగా. ఈసినిమాను సందీప్ తీసిన విధానం అలానే ఇక ఈ రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమా జనవరి 26వ తేదీన నుండి స్ట్రీమింగ్ అవుతుంది. హిందీతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈసినిమా అందుబాటులో ఉంది. రీసెంట్ గానే ఇంగ్లీష్ లో కూడా ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక ఈసినిమా ఓటీటీ లో కి వచ్చి మూడు వారాలు అయిపోతున్నా ఇంకా తన హవాను కొనసాగిస్తూనే ఉంది. నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ ఛార్ట్ లో టాప్ 10 లో ఈసినిమా 8వ స్థానంలో 1.9 మిలియన్ వ్యూస్ తో ఇంకా తన సత్తా చూపిస్తూనే ఉంది.

కాగా ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా.. అనిల కపూర్, బాబి డియోల్, తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటించారు
టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ ​కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ నిర్మించారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈసినిమా అమిత్ రాయ్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.