టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్

siddhu jonnalagadda tillu square movie trailer out now

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది డీజే టిల్లు సినిమా. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈసినిమాలోని డైలాగ్స్, సాంగ్స్, టిల్లు యాటిట్యూడ్ అన్నీ సినిమాకు హైలెట్ నిలిచి సంచలన విజయం అందించాయి. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా సిద్దూ నటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్, పలు పాటలను రిలీజ్ చేయగా అవి కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమా రిలీజ్ కు ఇంకా నెల రోజులు ఉండగానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడం విశేషం. మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. సిద్దూ నటన, డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ మిరియాల ,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా..సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 11 =