రామం రాఘవం ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

Ramam Raghavam Movie first Glimpse out now

కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ధనరాజ్ సినిమాల్లో కంటే జబర్దస్త్ కామెడీ షో ద్వారానే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాతా హీరోగా మారి పలు సినిమాలు కూడా చేశాడు. నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక ఇప్పుడు తానే దర్శకుడిగా మారి మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రామం రాఘవం అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమాలో డైరెక్టర్ కమ్ టాలెంటెడ్ నటుడు అయిన సముద్రఖని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా అంచనాలు బాగానే పెరిగాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే పలు పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎనర్జిటిక్ హీరో రామ్ చేతుల మీదుగా ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ అయితే ఫీల్ గుడ్ తో ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ఇంకా హరీశ్ ఉత్తమన్, మోక్ష, శ్రీనివాస రెడ్డి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నాడు. అరుణ్ చిలువేరు సంగీతాన్ని అందిస్తున్న ఈసినిమాకు శివప్రసాద్ యానాల కథ అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − eight =