అల్లరి నరేష్ 61 నుండి క్రేజీ అప్ డేట్

interesting update from allari naresh 61 movie

అల్లరి నరేష్ కూడా ఈమధ్య డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే కదా. నాంది సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికాడు. నాంది సినిమాలో తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు వచ్చాయి. ఈరెండు సినిమాలు కూడా మిశ్రమ స్పందనను దక్కించుకున్నాయి. రీసెంట్ గా నా సామిరంగ సినిమాలో ఒక కీలక పాత్రలో కూడా నటించాడు. ఇక ఇప్పుడు పలు సినిమాలను లైన్ లో పెట్టాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందులో మల్లి అంకం దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఈసినిమా ఎప్పుడో మొదలుపెట్టారు కూడా. ప్రస్తుతానికి నరేష్ 61 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి రేపు ఒక అప్ డేట్ ను ఇవ్వనున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుండగా హర్ష చెముడు, అరియానా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 8 =