జర్మనీకి పయనమైన అల్లు అర్జున్.. ఎందుకంటే?

Icon Star Allu Arjun Jets off to Germany For Attend To Berlin Film Festival

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘పుష్ప 2’లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈ సినిమా చిత్రీకరణకు స్వల్ప విరామం ప్రకటించి జర్మనీకి ప‌య‌న‌మ‌య్యారు. ఈ మేరకు గురువారం ఉదయం అల్లు అర్జున్ హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెర్లిన్ వెళుతున్న వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఆయన ఇంత అకస్మాత్తుగా జర్మనీకి పయనం కావడంపై అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ జ‌ర్మ‌నీకి బయలుదేరడానికి ముఖ్య కారణం ఏంటో తెలిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అక్కడ జ‌రిగే ప్రతిష్టాత్మకమైన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడం కోసమే. ఈ వేడుకలో భాగంగా సుకుమార్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప: ది రైజ్’ సినిమా ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ సినిమా తరపున ప్రాతినిధ్యం వహించేందుకు అల్లు అర్జున్ బెర్లిన్‌కు బయలుదేరారు. ఇక ఇదిలా ఉండగా.. ప్ర‌స్తుతం పుష్ప-2 షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క‌థ‌నాయిక‌గా న‌టిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =