దళపతి విజయ్ తన తరువాత సినిమా వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. న్యూ ఇయర్ సందర్భంగా ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈసినిమా షూటింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా షూటింగ్ ను ఏప్రిల్ చివరికల్లా పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నారట. వీలైనంత త్వరగా పూర్తిచేసి రిలీజ్ ను కూడా వీలైనంత త్వరగా చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పాండిచ్చేరిలో ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుంది చిత్రయూనిట్. ప్రస్తుతం చెన్నైలో ఒక చిన్న షెడ్యూల్ ను జరుపుకుంటుంది. దీని తరువాత శ్రీలంక వెళ్లి అక్కడే చాలా వరకూ కీలకమైన సన్నివేశాలను పూర్తిచేయనున్నారట.
కాగా సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: