హృతిక్ రోష‌న్‌కి గాయం.. త్వరగా కోలుకోవాలని కోరుతున్న ఫ్యాన్స్‌

Hrithik Roshan Post Goes Viral as He Shares Mirror Selfie with Crutches

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌కి గాయ‌మైంది. ఈ మేర‌కు విషయాన్ని ఆయ‌నే త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేయడం ద్వారా వెల్లడించారు. అందులో త‌న న‌డుముకు బెల్ట్ పెట్టుకుని కనిపించిన హృతిక్.. క్ర‌చెస్ సపోర్టుతో నిలబడి ఉన్నారు. దీనిని చూస్తుంటే హృతిక్ రోష‌న్‌ కాళ్లు, బ్యాక్ బోన్‌కి బలమైన గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇక హృతిక్ గాయపడటం గురించి తెలిసిన పలువురు సినీ ప్ర‌ముఖులు టైగ‌ర్ ష్రాఫ్, వ‌రుణ్ ధావ‌న్‌, వాణీ క‌పూర్ త‌దితులు ఆయ‌న త్వ‌రగా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. అలాగే దీనిపై స్పందించిన హృతిక్ ఫ్యాన్స్‌ మరియు కొందరు నెటిజ‌న్లు ఆయనకు తమ మద్దతు తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సందర్భంగా ఆయన .. “మీలో ఎంత మందికి క్ర‌చెస్‌, వీల్ ఛైర్ అవ‌స‌ర‌మొచ్చింది. అప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి?” అని పోస్ట్ చేశారు. అలాగే గతంలో తన తాతతో జరిగిన ఓ ఘటన గురించి గుర్తు చేసుకున్నారు. హృతిక్ చెప్పినదాని ప్రకారం.. “నా చిన్నప్పుడు ఒకసారి మా తాత గారితో కలిసి ప్రయాణం కోసం ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాం. అప్పుడు ఆయన ఆరోగ్యం అంతగా బాగాలేదు. అందుకే వీల్‌చైర్‌ని చూపించి ఇది పట్టుకుని నడవండి.. ఇది గాయాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది అని చెప్పాను.అయితే అందులో కూర్చోవడానికి మా తాత ఒప్పుకోలేదు. ఎందుకంటే అది తాను బలహీనమైన వాడినని ఆయనకు గుర్తు చేస్తుందట” అని తెలిపారు.

ఇంకా ఆయన ఇలా అన్నారు.. “దీంతో నాకు చాలా బాధగా అనిపించింది.. గాయం కోసం వీల్‌చైర్ అవసరమని, అతని వృద్ధాప్యానికి కాదని నేను చెప్పేందుకు ప్రయత్నించా కానీ.. నా వయసు అప్పుడు చాలా తక్కువ.. అందుకే నేను ఆయనని ఒప్పించలేకపోయాను. అలా అన్నీ భరించడం, ధైర్యంగా ఉండటం సైనికుడి లక్షణం. మా నాన్న కూడా అదే కండిషనింగ్‌కి వచ్చారు. సైనికులెప్పుడూ ఇలాంటి వాటిని వాడేందుకు ఇష్టపడరు.. నిజమైన బలం అనేది ఇలా వీల్ చైర్స్, క్లచెస్ పట్టుకోవడంలో ఉండదు. అవసరమైతే ఇలాంటివి వాడండి.. త్వరగా కోలుకోండి” అని పేర్కొన్నారు హృతిక్ రోషన్.

కాగా ప్రస్తుతం ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హృతిక్ రోషన్ ఇటీవలే ఫైటర్ అనే సినిమాలో నటించారు. ఇందులో ఆయన భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు. త్వరలోనే అయాన్ ముఖ‌ర్జీ డైరెక్ష‌న్‌లో తెరకెక్కనున్న ‘వార్ 2’ కోసం హృతిక్ సిద్దం అవుతున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించనున్న విషయం తెలిసిందే. వ‌చ్చే ఏడాది ఈ సినిమా విడుద‌ల చేయ‌డానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుండగా.. ఇప్పటినుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 3 =