కుర్చీ మ‌డ‌తపెట్టి సాంగ్‌.. మ‌హేశ్‌బాబు అన్న కూతురు డ్యాన్స్‌ చూశారా?

Mahesh Babu Brother's Daughter Dance For Kurchi Madathapetti Song Goes Viral

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ఇటీవలే ‘గుంటూరు కారం’ చిత్రంతో సక్సెస్ అందుకున్నారు. ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ మూవీ దాదాపు 250 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో మహేష్ నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ.. ఇలా ప్రతి ఒక్కటి అభిమానులకు పండుగ సంబరాన్ని డబుల్ చేసింది. ఇక ఈ సినిమాలోని ‘కుర్చీ మ‌డ‌తపెట్టి’ సాంగ్‌ అయితే నెట్టింట విపరీతంగా ట్రెండింగ్ అయింది. ఈ పాటలో హీరో మహేష్ బాబుతోపాటు హీరోయిన్ శ్రీలీల డ్యాన్స్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా శ్రీలీల అయితే అన్ మ్యాచబుల్ అన్నట్లుగా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను థ్రిల్ చేసింది. కాగా ఈ పాటకు దేశవిదేశాల్లోని అనేకమంది రీల్స్ చేయడం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ లిస్టులోకి మ‌హేష్ బాబు సోదరుడి కుమార్తె చేరింది. సూప‌ర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మ‌హేష్ బాబు అన్న ర‌మేష్ బాబు కూతురు భార‌తి ఈ ‘కుర్చీ మ‌డ‌తపెట్టి’ సాంగ్‌కు రీసెంట్‌గా డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన రీల్ ప్రస్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో శ్రీలీల రేంజ్‌లో భారతి డ్యాన్స్ మూమెంట్స్ చూసి నెటిజెన్ల షాక్ అవుతున్నారు. ర‌మేష్ బాబు కూతురిలో ఇంత టాలెంట్ ఉందా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. చేసిందంటూ తెగ‌ మెచ్చుకుంటున్నారు. ఇక సూప‌ర్‌స్టార్ అభిమానులైతే దీనిని తెగ వైరల్ చేస్తున్నారు.

కాగా కృష్ణ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న సమయంలోనే ర‌మేష్ బాబు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు మ‌హేష్ బాబు బాలనటుడిగా చేస్తుండటం గమనార్హం. కొన్ని హిట్ సినిమాలలో నటించిన రమేష్ బాబు ఆ తర్వాత ఇండస్ట్రీలో కంటిన్యూ కాలేకపోయారు. ఈ క్రమంలో ఆయన చివ‌ర‌గా 1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎన్‌కౌంట‌ర్’ అనే చిత్రంలో తన తండ్రితో క‌లిసి న‌టించారు. ఇక మ‌హేష్ బాబుతో ‘అర్జున్‌’, ‘అతిథి’ చిత్రాలు నిర్మించారు ర‌మేష్ బాబు. అయితే అనారోగ్య కారణాలతో 2022 జనవరి 8న ర‌మేష్ బాబు కన్నుమూశారు. ఆయన కుమారుడు జ‌య‌కృష్ణ, మ‌హేష్ బాబు ‘నిజం’ సినిమాలో ఓ పాట‌లో క‌నిపించడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − one =