మెగాస్టార్ చిరంజీవికి అమెరికాలో ఘనంగా సన్మానం జరిగింది. అక్కడి ఎన్నారైలు మరియు మెగాస్టార్ అభిమానుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ దంపతులు పాల్గొనగా వారిని అభిమానులు పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సత్కరించారు. కాగా మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ క్రమంలో త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలాఉంటే.. చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష చిరు సరసన కథానాయికగా నటిస్తున్నారు. 18 ఏళ్ల క్రితం చిరుతో కలిసి ‘స్టాలిన్’ సినిమాలో నటించిన ఆమె.. మళ్లీ ఇన్నాళ్లకు మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్‌పై సందడి చేయనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని దాదాపు రూ. 200 కోట్లతో బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: