ఒకనాటి అందాలతార శ్రీదేవి తెలుగు చిత్ర పరిశ్రమలో తన సినిమాలతో ఎన్నో ఏళ్లు ఏలారు. కేవలం తెలుగు మాత్రమే కాదు తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు చేశారు. ఇక శ్రీదేవి చనిపోయిన తరువాత ఇప్పుడు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆ కోరిక కూడా తీరిపోనుంది. ఇప్పటికే జాన్వీ కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకోనుండగా ఈఏడాది దసరా పండుగ కానుకగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా రామ్ చరణ్ తో కూడా జాన్వీ కపూర్ నటించనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఆర్సీ16 సినిమాలో హీరోయిన్ గా జాన్వీనే నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలకు క్లారిటీ వచ్చేసింది. జాన్వీ తండ్రి అయిన బోనీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో త్వరలోనే రామ్ చరణ్ తో జాన్వీ కపూర్ ఒక సినిమా చేస్తుంది అంటూ స్పష్టం చేశారు. దీంతో బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూరే అని ఫిక్స్ అయిపోయారు అందరూ.
Producer @BoneyKapoor spills the beans about #JanhviKapoor‘s upcoming project in an interaction with the media.#RamCharan #RC16 #TeluguFilmNagar pic.twitter.com/S6D3VQXyQI
— Telugu FilmNagar (@telugufilmnagar) February 19, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: