టాలీవుడ్ హీరో నితిన్ ఇటీవలే ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘రాబిన్‌హుడ్’. ట్యాలెంటెడ్ మేకర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి ‘భీష్మ’ అనే సినిమా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సక్సెస్ ఫుల్ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. ఈ క్రమంలో ఈసారి యూనిక్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్‌తో రాబోతోంది. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. నితిన్ సరికొత్త పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో ట్రెండీ లుక్‌లో అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నితిన్ పాత్రను పరిచయం చేసిన గ్లింప్స్ ఫన్నీగా ఉంది, అదే సమయంలో, కాన్సెప్ట్, ప్రెజెంటేషన్ పరంగా సరికొత్తగా వుంది. తాజాగా ‘రాబిన్‌హుడ్’ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది చిత్ర బృందం. గత కొన్ని రోజులుగా మున్నార్‌లో జరుగుతున్న కీలక షెడ్యూల్ పూర్తయినట్లు తెలిపింది. ఈ షెడ్యూల్లో ముఖ్యమైన టాకీ పార్ట్స్, హీరో నితిన్ సహా ఇతర నటీనటులపై భారీ యాక్షన్ బ్లాక్‌ను చిత్రీకరించినట్లు వెల్లడించింది మూవీ టీం. ఇక త్వరలోనే సినిమా తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు మేకర్స్.
ఇక ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాను విజయవంతమైన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్ కోసం ఆయన అందించిన అద్భుతమైన స్కోర్ ఆకట్టుకుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: