సరిపోదా శనివారం నుండి వచ్చే శనివారం స్పెషల్ ట్రీట్

special treat from Saripodhaa Sanivaaram movie

గత ఏడాది రెండు సినిమాలతో అలరించిన నాని ప్రస్తుతం కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ కూాడా అప్పుడప్పుడూ ఇస్తూనే ఉన్నారు మేకర్స్. ఇక ఈసినిమా నుండి తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. వచ్చే శనివారం అంటే ఫిబ్రవరి 24వ తేదీన ఈసినిమా నుండి స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. మరి ఆ స్పెషల్ ట్రీట్ ఏమైఉంటుందో తెలియాలంటే అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై  నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.