ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఈసినిమా ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ టాక్ తో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈసినిమా కథ, మేకింగ్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. ఫస్ట్ డే ఈసినిమా 6 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఈసినిమా రిలీజ్ అయి మూడు రోజులు పూర్తవుతుంది. మూడు రోజుల్లో ఈసినిమా 20 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మరోవైపు ఈ గ్యాప్ లో వేరే సినిమాలు రిలీజ్ కు కూడా లేవు కాబట్టి ముందు ముందు ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశమే ఉంది.
Setting the screens and box office ablaze ❤️🔥🔥
MAGICAL ENTERTAINER #OoruPeruBhairavaKona collects 2️⃣0️⃣.3️⃣0️⃣Cr gross WW in 3 days 💥
A heartfelt thanks to all the audience whose WOM made this extraordinary success possible ♥️
– https://t.co/OV3enwDhNJ@sundeepkishan’s… pic.twitter.com/GTfbgj2TkE
— AK Entertainments (@AKentsOfficial) February 19, 2024
ఈసినిమాలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మించాయి. శేఖర్ చంద్ర సంగీతం అందించగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: