
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 122


చిరంజీవి, రామ్ చరణ్ గొప్ప మనస్సు

డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్

ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన బలగం

ఆయ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

దేవర సెకండ్ సింగిల్.. నెక్స్ట్ లెవెల్లో

పుష్ప 2 షూటింగ్ ఆలస్యం అందుకే

G2 నుంచి.. ఒకేసారి 6 థ్రిల్లింగ్ అప్‌డేట్స్

వయనాడ్ సహాయక చర్యల్లో మోహన్‌లాల్

డైనమిక్ నిర్మాత చేతిలో దేవర రిలీజ్ హక్కులు

కంగువ రిలీజ్ అయ్యాక.. ఆ సాహసం ఎవ్వరూ చేయరు

బిగ్ బాస్ 8 టీజర్ రిలీజ్

ధనుష్ రాయన్ కు అరుదైన గౌరవం

మహారాజ డైరెక్టర్‌ను అభినందించిన సూపర్ స్టార్

ప్రముఖ సంస్థకు దేవర కర్ణాటక రిలీజ్ హక్కులు
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి ఇప్పటివరకూ ఎలాంటి సినిమా రాలేదు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి కూడా రెండు సంవత్సరాలు దాటిపోయింది. దీంతో తమ హీరోను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే తన నుండి వస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాా వరకూ షూటింగ్ ను కూడా వరకూ పూర్తి…

ది గోట్ థర్డ్ సింగిల్ ఫుల్ సాంగ్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా తనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు విజయ్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా ది గోట్. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా సైలెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో సత్తా చాటిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి
టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్ 'బేబి' 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో చరిత్ర సృష్టించింది. యంగ్ హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ నిర్మించారు. తెలుగునాట యూత్‌ని విశేషంగా అలరించి బాక్సాఫీస్ వద్ద హ్యుజ్ సక్సెస్ అందుకుంది.

35-చిన్న కథ కాదు నుంచి.. ఫ్రెండ్షిప్ ఆంథమ్ రిలీజ్
ప్రముఖ మలయాళ నటి నివేదా థామస్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం '35 - చిన్న కథ కాదు'. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాతో నందకిశోర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, మూవీ టీజర్ రిలీజ్ చేశారు. అలాగే నివేదా థామస్ పాత్రను పరిచయం చేస్తూ 'సరస్వతీ నమస్తుభ్యం' పేరుతో ఓ స్పెషల్ వీడియో కూడా విడుదల చేశారు. వీటన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది.

చిరంజీవి, రామ్ చరణ్ గొప్ప మనస్సు
కార్గిల్ వార్ సందర్భంలో కానీ, గుజరాత్ భూకంపం సంభవించినప్పుడు, సునామీ వచ్చి ప్రజలు ఇక్కట్లు పడుతున్నప్పుడు, ఉత్తరాఖండ్ వరదలు, కోనసీమ వరదల సమయంలో కానీ, వైజాగ్‌లో హుదూద్ వచ్చినప్పుడు, కోవిడ్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు.. ఇలా ఒకటేమిటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా నిలబడుతూ తనదైన స్పందనను తెలియజేసే మొట్టమొదటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.

డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్
రామ్ పోతినేని హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండిపోయింది. అంతేకాదు రామ్ మాస్ యాక్షన్, కామెడీని కూడా ట్రైలర్ లో చూపించారు. ఇప్పుడు నా బ్రెయిన్ నీ బ్రెయిన్ లోకి వెళ్లబోతుంది అంటూ సంజయ్ దత్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. చివరలో…

తండేల్.. త్వరలో మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్
యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్'. ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన బలగం
సౌత్ సినీ పరిశ్రమలకు చెందిన 69వ శోభ ఫిలిం ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. హైద్రాబాద్ వేదికగా జరిగిన ఈ కార్యకమానికి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇండస్ట్రీల నుండి సెలబ్రిటీలు తరలివచ్చారు. ఇక ఈ ఏడాదికి గాను మన తెలుగు సినిమాలు చాాలానే అవార్డులను దక్కించుకున్నాయి. అందులో బలగం సినిమా కూడా తన సత్తాను చాటింది.

ఆయ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ టాప్ బ్యానర్ అయిన గీతా ఆర్స్ట్ పెద్ద సినిమాలే కాదు కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను కూడా నిర్మించడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు. ఇప్పటికే పలు చిన్న సినిమాలను నిర్మించి హిట్లను అందుకోగా ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నారు. నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆయ్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి…

వయనాడ్ బాధితులకు అండగా.. నయనతార, రష్మిక భారీ విరాళం
కేరళ రాష్ట్రం ప్రకృతి విపత్తుతో అతలాకుతలం అవుతోంది. అక్కడ గత వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో పలు జిల్లాలు నీట మునిగాయి. తీవ్ర విషాదంలో మునిగివుంది. ముఖ్యంగా వయనాడ్‌లో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర బలగాలు, మిలిటరీ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టింది. అధికారిక సమాచారం మేరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 358కు పెరిగింది. అయితే సహాయక చర్యలు కొనసాగుతున్న క్రమంలో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

దేవర సెకండ్ సింగిల్.. నెక్స్ట్ లెవెల్లో
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

పుష్ప 2 షూటింగ్ ఆలస్యం అందుకే
పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్లో ఎంత సంచలనం సృష్టించిందో చూశాం కదా. ఇప్పుడు అందరి చూపు పుష్ప2పై పడింది. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు హిందీ ఆడియన్స్ ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ కాబట్టి సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉండటం కామన్. దానికి తగ్గట్టే మేకర్స్ ఎక్కడా తగ్గకుండా సినిమాను తీస్తున్నారు.

G2 నుంచి.. ఒకేసారి 6 థ్రిల్లింగ్ అప్‌డేట్స్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'G2'. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఇది బనితాకు మొదటి పాన్ ఇండియా చిత్రం కానుంది. ఇంతకుముందు ఆమె అక్టోబర్, సర్దార్ ఉదం, తమిళ చిత్రం ఆదిత్య వర్మ వంటి చిత్రాలలో నటించింది.

ఇండియన్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భారతీయుడు. ఈసినిమా ఈసినిమా 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సంగతి తెలిసిందే కదా. అలా ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

వయనాడ్ సహాయక చర్యల్లో మోహన్‌లాల్
మాలీవుడ్ సూపర్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత నటుడు మోహన్‌లాల్ శనివారం కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. ఇటీవల సంభవించిన విపత్తు కారణంగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించారు. ఆగస్టు 30వ తేదీ తెల్లవారుజామున మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. అధికారిక సమాచారం మేరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 358కు పెరిగింది. ఈ నేపథ్యంలోనే మోహన్‌లాల్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు.

డైనమిక్ నిర్మాత చేతిలో దేవర రిలీజ్ హక్కులు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి రాబోతున్న మోస్ట్ అవైడెట్ సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా, దేవర మొదటి భాగం సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుండగా.. షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక రిలీజ్ కు రెండు నెలలు టైమ్ ఉండగా ఇప్పుడిప్పుడే ప్రమోషన్లలో వేగం పెంచుతున్నారు. ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. మరోవైపు పాటలను కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఫియర్ సాంగ్ రిలీజ్ కాగా ఆ పాట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

కంగువ రిలీజ్ అయ్యాక.. ఆ సాహసం ఎవ్వరూ చేయరు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. ప్రముఖ తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకుముందు సూర్య నటించిన 'సింగం' సిరీస్‌కు దేవినే సంగీతం అందించిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ 8 టీజర్ రిలీజ్
బుల్లి తెర ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ఉంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పటివరకూ తెలుగులో ఏడు సీజన్లు పూర్తవగా త్వరలో సీజన్ 8 ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ఈ సీజన్ నుండి అప్ డేట్లు మొదలయ్యాయి.

ధనుష్ రాయన్ కు అరుదైన గౌరవం
ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 26వ తేదీన రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకొని సూపర్ హిట్ ను అందించింది. ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా సినిమాలో ధనుష్ నటనకు, స్క్రిప్ట్‌కి, టేకింగ్‌కి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి చాలా మంచి పేరు వచ్చింది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇప్పటికే ఈసినిమా 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయింది.

మహారాజ డైరెక్టర్‌ను అభినందించిన సూపర్ స్టార్
కోలీవుడ్ విలక్షణ నటుడు, 'మక్కళ్ సెల్వన్' విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. జూన్ 14న విడుదలైన మహారాజ తమిళంతో పాటు తెలుగులో సూపర్ హిట్ అయింది. తమిళనాడులో రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టి విజయ్ సేతుపతి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమా ఆయనకు సోలో హీరోగా తొలి 100 కోట్ల మూవీ కావడం గమనార్హం.