కేరళ రాష్ట్రం ప్రకృతి విపత్తుతో అతలాకుతలం అవుతోంది. అక్కడ గత వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో పలు జిల్లాలు నీట మునిగాయి. తీవ్ర విషాదంలో మునిగివుంది. ముఖ్యంగా వయనాడ్‌లో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర బలగాలు, మిలిటరీ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టింది. అధికారిక సమాచారం మేరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 358కు పెరిగింది. అయితే సహాయక చర్యలు కొనసాగుతున్న క్రమంలో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చిత్ర రంగానికి చెందిన పలువురు ప్రముఖులు బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార దంపతులు వయనాడ్ బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ వీరికి రూ.20 లక్షల సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందించారు. దీనిపై కేరళ సీఎం పినరయి విజయన్‌కు రాసిన లేఖను నయనతార సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరోవైపు నేషనల్ క్రష్ రష్మిక మందున్న కూడా వయనాడ్ ఘటనపై స్పందించింది. మానవతా దృక్పథంతో బాధితులకు సాయమందించేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో రూ.10 లక్షలను కేరళ ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి పంపింది. కాగా ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, జ్యోతిక దంపతులతో పాటు కార్తి, చియాన్ విక్రమ్, మలయాళ నటులు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాసిల్ మరియు నజ్రియా దంపతులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: