కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. ప్రముఖ తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకుముందు సూర్య నటించిన ‘సింగం’ సిరీస్‌కు దేవినే సంగీతం అందించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సూర్య 42వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ‘కంగువ’ నుంచి రిలీజైన మూవీ గ్లింప్స్ వీడియో, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఫైర్ సాంగ్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. టీజర్‌లో అయితే సూర్య నట విశ్వరూపాన్ని చూపించాడు. ముఖ్యంగా ట్రైబల్ క్యారక్టర్‌లో అదరగొట్టేశాడు. చూడటానికి భీతిగొలిపేలా ఉన్న ఈ పాత్రను ఆయన తప్ప మరెవ్వరూ చేయలేరు అనేట్టుగా నటించాడు.
ఇక ఇదిలావుంటే, తాజాగా కంగువ రిలీజ్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమా విడుదల సమయంలోనే మరికొన్ని మూవీస్ రిలీజ్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా దీనిపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన స్మూత్ వార్నింగ్ ఇచ్చారు. “రిలీజ్ అయ్యేంత వరకు కంగువతో తలపడాలని జనాలు అనుకుంటారు. కానీ ఒక్కసారి కంగువ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యాక మాత్రం కంగువ 2తో ఢీకొనే సాహసం ఎవ్వరూ చేయరు” అని తేల్చి చెప్పారు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్సలెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ స్పష్టం చేసారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య పలు గెటప్స్‌లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తోంది. అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 భాషల్లో 3డీ వర్షెన్‌లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: