ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి ఇప్పటివరకూ ఎలాంటి సినిమా రాలేదు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి కూడా రెండు సంవత్సరాలు దాటిపోయింది. దీంతో తమ హీరోను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే తన నుండి వస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాా వరకూ షూటింగ్ ను కూడా వరకూ పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా తెలుగురాష్ట్రాల రిలీజ్ కు సంబంధించి అప్ డేట్ ను ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాను భారీగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు మరో అప్ డేట్ తో వచ్చారు. కన్నడ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. ఈసినిమా కన్నడ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్ ప్రొడక్షన్ వారు సొంతం చేసుకున్నట్టు తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: