మాలీవుడ్ సూపర్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత నటుడు మోహన్‌లాల్ శనివారం కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. ఇటీవల సంభవించిన విపత్తు కారణంగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించారు. ఆగస్టు 30వ తేదీ తెల్లవారుజామున మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. అధికారిక సమాచారం మేరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 358కు పెరిగింది. ఈ నేపథ్యంలోనే మోహన్‌లాల్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే మోహన్‌లాల్ టెరిటోరియల్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా ఆయన ఈ ఉదయాన్నే వయనాడ్ చేరుకుని టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపును సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి ఆ ప్రాంతంలో జరుగుతున్న రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్ల గురించి వివరించారు. ఇక సైనికాధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఆయన ముండక్కై, పుంఛిరిమట్టం ప్రాంతాలను సందర్శించారు.
కాగా 2009లో మోహన్‌లాల్‌కి టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ ర్యాంక్ లభించింది. కాగా తన సినిమాలలో యూనిఫారంలో ఉన్న మిలిటరీ అధికారులను నిజాయితీగా చూపించినందుకు గాను అతనికి ఈ గౌరవప్రదమైన హోదా లభించింది. ఇక మోహన్‌లాల్ ఇప్పటికే రూ. 25 లక్షలను ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి అందించారు. అలాగే, టెరిటోరియల్ ఆర్మీ చేస్తున్న సహాయక చర్యలకు కృతజ్ఞతలు తెలుపారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో నిర్విరామంగా పనిచేసిన భారత సైన్యాన్ని అభినందించారు.
ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. “వయనాడ్ విపత్తు బాధితులకు సహాయం అందించడానికి నిస్వార్థ వాలంటీర్లు, పోలీసులు, ఫైర్ అండ్ రెస్క్యూ, NDRF, ఆర్మీ సైనికులు, ప్రభుత్వ అధికారులు మరియు ప్రతి వ్యక్తి యొక్క ధైర్యానికి నేను వందనం చేస్తున్నాను. నా 122 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్, TA మద్రాస్, సహాయ మిషన్‌లో ముందంజలో ఉన్నందుకు నేను కృతజ్ఞుడను. మేము ఇంతకు ముందు ఇలాంటి అనేక సవాళ్లను ఎదుర్కొన్నాము. ఈ క్లిష్ట సమయంలో మనం ఐక్యంగా ఉండి మన ఐక్యత యొక్క శక్తిని చూపించాలని నేను ప్రార్థిస్తున్నాను. జై హింద్!” అని పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: