బుల్లి తెర ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ఉంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పటివరకూ తెలుగులో ఏడు సీజన్లు పూర్తవగా త్వరలో సీజన్ 8 ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ఈ సీజన్ నుండి అప్ డేట్లు మొదలయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే సీజన్ సీజన్ లోగో ను విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. 8వ సీజన్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. కమెడియన్ సత్య పాత్రతో పరిచయమైన టీజర్‌లో నాగార్జున వరాలు అందించే జీనీ పాత్రలో కనిపించారు. ఈసారి అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ అంటూ.. ఒక్కసారి కమిట్ ఐతే లిమిటే లేదు అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ తో సీజన్ 8 మరించ ఎంటర్ టైనింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ బిగ్ బాస్ 8 ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న వార్తలు అయితే వస్తున్నాయి.
ఇక ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొదటి సీజన్ కు ఎన్టీఆర్, రెండో సీజన్ కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేయగా.. మూడో సీజన్ నుండి నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా అప్పుడే ఈసీజల్ పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ అంటూ కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో విష్ణు ప్రియ, రితూ చౌదరి, అమృత ప్రణయ్, బంచిక్ బబ్లు, యూట్యూబర్ అనిల్, యాదమ్మ రాజు, ఖయ్యూమ్ అలీ, సోనియా సింగ్ బిగ్ బాస్ సీజన్8 కంటెస్టెంట్స్‌గా ఎంపికైట్లు సమాచారం. మరి వారిలో ఎంతమంది ఉంటారో? ఉండరో ? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: