
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 123


మురారి రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ఈవెంట్ వేదిక ఖరారు

కేరళ బాధితులకు లక్కీ భాస్కర్ టీమ్ సాయం

రజనీకాంత్ వేట్టైయాన్లో నా పాత్ర ఏంటంటే?

దేవర సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ చరణ్-నిఖిల్ ప్రాజెక్ట్ లోకి అనుపమ్ ఖేర్

సిటాడెల్ హనీ బన్నీ టీజర్ రిలీజ్

VD 12.. క్రేజీ అప్డేట్స్

మూవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించిన కల్కి టీమ్

బడ్డీ క్లాస్, మాస్ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది

ఓజీ, రాజా సాబ్ లపై.. తమన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్స్, నెట్టింట వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీలపై టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్. తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందించారు. పవన్ కళ్యాణ్ హీరోగా పలు చిత్రాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు ఉన్నాయి. అలాగే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. దీంతో ఈ హీరోల ఫ్యాన్స్ ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తంగలాన్ నుండి.. వార్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్
కోలీవుడ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తంగలాన్'. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్‌గా తెరకెక్కుతోంది. బ్రిటిష్ పాలనలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి.

మురారి రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. సెలబ్రిటీల పుట్టిన రోజుల సందర్భాలు, ప్రత్యేక అకేషన్స్ అప్పుడు సినిమాలను రీ రిలీజ్ లు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమా రీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆ సినిమా మరేదో కాదు మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 2001లో విడుదలైన ఈసినిమా మహేష్ సినీ కెరీర్ నే ఒక మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందుకుంది. కథ, కథాంశం, మహేష్ నటన, పాటలు అన్నీ సినిమా విజయంలో భాగమయ్యాయి.

డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ఈవెంట్ వేదిక ఖరారు
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ ఇద్దరికీ మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా 2019 లో వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈసినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ కావడంతో మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, మూడు పాటలను రిలీజ్ చేయగా అప్ డేట్లు అన్నీ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.

సర్దార్ 2.. కార్తి సరసన హీరోయిన్గా స్టార్ యాక్ట్రెస్
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన 'సర్దార్' చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీనికి ఇప్పుడు సీక్వెల్ సిద్ధమవుతోంది. ఇటివలే 'సర్దార్ 2' రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో భారీ సెట్స్ మధ్య ప్రారంభమైయింది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన డైరెక్టర్ పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

మిస్టర్ బచ్చన్ నుండి జిక్కీ ఫుల్ సాంగ్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'మిస్టర్ బచ్చన్'. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్- జిక్కీ సాంగ్ ని రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ తన అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో మెస్మరైజింగ్ నెంబర్ ని కంపోజ్ చేశారు. సాంగ్ లో మోడరన్, క్లాసిక్ టచ్ ని అద్భుతంగా బ్లెండ్ చేశారు. ఈ సాంగ్ వండర్ ఫుల్ మ్యూజికల్ గ్రాండియర్ ని అందిస్తోంది. లిరిక్ రైటర్ వనమాలి పొయిటిక్ డెప్త్ తో ఎమోషన్ ని కంప్లీట్ చేశారు. కార్తీక్, రమ్య బెహరా అందించిన వోకల్స్ టాప్ క్యాలిటీ, మెలోడీ ఇంటర్‌ప్లే…

కేరళ బాధితులకు లక్కీ భాస్కర్ టీమ్ సాయం
కేరళ లోని వరద బాధితులకు సెలబ్రిటీల నుండి ఆర్థిక సహాయాలు అందుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే తమిళ్ స్టార్ హీరోలు విక్రమ్, సూర్య, కార్తీ తో పాటు పలువురు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాలు అందించారు. ఇప్పుడు ఈ జాబితాలో లక్కీ భాస్కర్ టీమ్ కూడా చేరిపోయింది. లక్కీ భాస్కర్ టీమ్ కేరళ బాధితులకు 5 లక్షల విరాళం అందించినట్టు తెలిపారు.

రజనీకాంత్ వేట్టైయాన్లో నా పాత్ర ఏంటంటే?
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వేట్టైయాన్'. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్ టీజర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసింది. దుషారా విజయన్, రితికా సింగ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

దేవర సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

రామ్ చరణ్-నిఖిల్ ప్రాజెక్ట్ లోకి అనుపమ్ ఖేర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొత్త ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, 'యూవీ క్రియేషన్స్'కి చెందిన విక్రమ్ రెడ్డితో కలిసి 'వీ మెగా పిక్చర్స్' అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అయితే ఈ పతాకంపై తీసే తొలి చిత్రంలో యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్నాడు. ఈ క్రమంలో తమ మొదటి ప్రాజెక్ట్‌కి 'ది ఇండియా హౌస్' అనే పేరు కూడా ఇదివరకే ప్రకటించారు.

తిరగబడరసామీ.. తెలుగు రివ్యూ
రాధాభాయ్గా మన్నారా చోప్రా ఓ పాటలో తళుక్కుమనిపించింది. అలాగే ప్రగతి, రాజా రవీంద్ర, పృధ్వీ పరిధి మేరకు నటించారు. పాటలు ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఇక అక్కడక్కడా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. జవహర్ రెడ్డి అందించిన కెమెరా పనితీరు బావుంది. నిర్మాణపరంగా ఫర్వాలేదనిపించింది. మొత్తానికి తిరగబడరసామీ ఫక్తు కమర్షియల్ మూవీ.

నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసిన రాజమౌళి స్పెషల్ డాక్యుమెంటరీ
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 'బాహుబలి 1&2', 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై సత్తా చాటడంతో రాజమౌళి పేరు అనేక దేశాల్లో మారుమ్రోగిపోయింది. వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ చాలామంది ఆయనకు అభిమానులయ్యారు. దీంతో రాజమౌళి గతంలో దర్శకత్వం వహించిన పలు సినిమాలను ఓటీటీ లలో వీక్షించడానికి వారు ఆసక్తిని కనబరుస్తున్నారు.

సిటాడెల్ హనీ బన్నీ టీజర్ రిలీజ్
రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో హాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇదే వెబ్ సిరీస్ ను ఇండియన్ వెర్షన్ లో కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. రాజ్ అండ్ డీ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో ఈ వెబ్ సిరీస్ వస్తుంది. సిటాడెల్ హనీ బన్నీ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ వస్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

VD 12.. క్రేజీ అప్డేట్స్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆయన 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'VD 12' (వర్కింగ్ టైటిల్) పై విజయ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

డార్లింగ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
కమెడియన్ గా సినీ కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు తనే హీరోగా సినిమాలు చేసే స్థాయికి చేరుకున్నాడు ప్రియదర్శి. ఇక రీసెంట్ తను హీరోగా వచ్చిన సినిమా డార్లింగ్. నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈసినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ నే క్రియేట్ చేసింది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జులై 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా మంచి విజయాన్ని అందించలేకపోయింది.

మూవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించిన కల్కి టీమ్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు కనిపించగా.. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలుగా నటించారు. అలాగే మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

అంజలి 50వ సినిమాకు బుల్లితెరపై అదిరిపోయే రేటింగ్స్
తెలుగు అమ్మాయి అంజలి టైటిల్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. 2014లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. 'ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి' అంటూ వస్తోన్న ఈ మూవీ అంజలి నటించిన 50వ సినిమా కావడం విశేషం. 'నిన్ను కోరి', 'నిశ్శబ్దం' చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన శివ తుర్లపాటి ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు.

మురారిలో ఆ పాటంటే నాకు చాలా ఇష్టం - సోనాలి బింద్రే
టాలీవుడ్లో గత కొంతకాలంగా రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని మేకర్స్ వాటిని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇక రీ-రిలీజ్‌లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు రెండు చేరాయి. ఆయన హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్స్ ‘ఒక్కడు’ మరియు 'మురారి' త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాయి.

సరిపోదా శనివారం నుంచి.. నాని పవర్ ప్యాక్డ్ యాక్షన్ పోస్టర్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. దీనిలో భాగంగా పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్డేట్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తున్నాయి.

బడ్డీ క్లాస్, మాస్ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది
అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలను తెలిపారు హీరో అల్లు శిరీష్.