లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భారతీయుడు. ఈసినిమా ఈసినిమా 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సంగతి తెలిసిందే కదా. అలా ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ పై సర్ ప్రైజింగ్ అప్ డేట్ అయితే వచ్చింది. ఇండియన్ 2 ఓటీటీ రిలీజ్ పై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈసినిమా ఓటీటీ రిలీజ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఆగష్ట్ 9వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు కూడా పలు కథనాలు వచ్చాయి. ఇక ఇప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆగష్ట్ 9వ ఈసినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ంగ్ రానుందని తెలిపారు. ఈసినిమాను తమిళ్, తెలుగు తోపాటు పలు భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటించగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ నిర్మించిన ఈసినిమాకు.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: