టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘G2’. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఇది బనితాకు మొదటి పాన్ ఇండియా చిత్రం కానుంది. ఇంతకుముందు ఆమె అక్టోబర్, సర్దార్ ఉదం, తమిళ చిత్రం ఆదిత్య వర్మ వంటి చిత్రాలలో నటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత కొన్నిరోజులక్రితం గుజరాత్‌లోని భుజ్‌లో జరిగిన ఓ భారీ షెడ్యూల్‌లో అడివి శేష్, బనితపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. గత కొన్నిరోజులక్రితం గుజరాత్‌లోని భుజ్‌లో జరిగిన ఓ భారీ షెడ్యూల్‌లో అడివి శేష్, బనితపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. కాగా ‘గూఢచారి’ సినిమా 2018లో ఆగస్టు 3న విడుదలయింది. ఈ నేపథ్యంలో ఆ మూవీ వచ్చి 6 ఏళ్ళు అయిన సందర్భంగా.. నేడు G2 నుంచి 6 వరుస అప్‌డేట్స్ ఇచ్చి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు హీరో శేష్.
దీనిలో భాగంగా అడివి శేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్స్ గమనిస్తే.. కొన్నింటిలో శేష్ రకరకాల గన్స్ పట్టుకుని అటాకింగ్‍కి రెడీగా ఉన్నాడు. మరోదానిలో ముఖంపై గాయాలతో చేతులకు సంకెళ్లతో బంధింపబడి ఉన్నాడు. ఇంకోదానిలో ఇమ్రాన్ హష్మీతో కలిసి కనిపించాడు. అయితే వీరిద్దరూ స్నేహితులా? శత్రువులా? ప్రత్యర్థులా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఓవరాల్‌గా ఎంతో ఇంటెన్స్‌గా ఉన్న ఈ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
కాగా జి2లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. స్టైలిష్ విలన్‌గా ఆయన కనిపించనున్నారు. 2018లో వచ్చిన గూఢచారి చిత్రానికి హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెల్‌గా ఆరేళ్ల తర్వాత మళ్లీ సెల్యులాయిడ్‌లోకి వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాను వచ్చే యేడాది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: