కార్గిల్ వార్ సందర్భంలో కానీ, గుజరాత్ భూకంపం సంభవించినప్పుడు, సునామీ వచ్చి ప్రజలు ఇక్కట్లు పడుతున్నప్పుడు, ఉత్తరాఖండ్ వరదలు, కోనసీమ వరదల సమయంలో కానీ, వైజాగ్‌లో హుదూద్ వచ్చినప్పుడు, కోవిడ్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు.. ఇలా ఒకటేమిటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా నిలబడుతూ తనదైన స్పందనను తెలియజేసే మొట్టమొదటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదేవిధంగా ఇప్పుడు మరోసారి ఆయన తన సహృదయతను చాటుకున్నారు. ఇక ఇటీవల కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అలాగే పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు, ఇంకా తమ ఆవాసాలను కోల్పోయారు. దీంతో వీరంతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కేరళ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ మద్ధతుని తెలియజేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి వయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ‘వయనాడ్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతుంది. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా సానుభూతిని ప్రకటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: