ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 26వ తేదీన రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకొని సూపర్ హిట్ ను అందించింది. ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా సినిమాలో ధనుష్ నటనకు, స్క్రిప్ట్‌కి, టేకింగ్‌కి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి చాలా మంచి పేరు వచ్చింది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇప్పటికే ఈసినిమా 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇన్ని రోజులు తన నటనతో ప్రపంచ ప్రేక్షకులను అలరించిన ధనుష్.. ఇప్పుడు దర్శకత్వంలో కూడా తన సత్తా చాటాడు. ఈనేపథ్యంలోనే ఈసినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోని బెస్ట్ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే సినిమాలక మాత్రమే ఆస్కార్ అకాడమీ లెబ్రరీలో చోటు దక్కుతుంది. ఇప్పుడు ఆ గొప్ప అవకాశం రాయన్ సినిమాకు దక్కడం విశేషం. రాయన్ స్క్రీన్‌ప్లేను తమ లైబ్రరీలో భద్రపరుస్తున్నామని ఆస్కార్ సంస్థ తెలియజేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో తెలియజేస్తూ తన సంతోషాన్ని పంచుకుంది.
కాగా ఈసినిమాలో ఇంకా ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, అపర్ణా బాలమురళి, ధుషార విజయన్ కీలక పాత్రల్లో నటించారు. తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్ డీవోపీగా.. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అలానే యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పీటర్ హెయిన్ వ్యవహరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: