సౌత్ సినీ పరిశ్రమలకు చెందిన 69వ శోభ ఫిలిం ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. హైద్రాబాద్ వేదికగా జరిగిన ఈ కార్యకమానికి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇండస్ట్రీల నుండి సెలబ్రిటీలు తరలివచ్చారు. ఇక ఈ ఏడాదికి గాను మన తెలుగు సినిమాలు చాాలానే అవార్డులను దక్కించుకున్నాయి. అందులో బలగం సినిమా కూడా తన సత్తాను చాటింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వేణు జల్దీ దర్శకత్వంలో చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని కథ, సన్నివేశాలు, పాత్ర సాధారణ ప్రజలకు దగ్గరగా ఉండటంతో చాలా మందికి కనెక్ట్ అయి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మేకర్స్ కు పదింతలు లాభాలు చేకూర్చింది.
ఇదిలా ఉండగా ఈసినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ గా కూడా ఈసినిమా పలు అవార్డులను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా మరోసారి ఫిలిం ఫేర్ అవార్డుల్లో తన సత్తా చాటింది. మూడు అవార్డులను దక్కించుకొని రికార్డు క్రియేట్ చేసింది. ఉత్తమ సినిమాగా బలగం ఎంపికవ్వగా.. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వేణు ఉత్తమ దర్శకుడిగా.. ఉత్తమ సహాయ నటిగా రూపా లక్ష్మీకి అవార్డులు దక్కాయి. ఇక తమ సినిమాకు అవార్డులు దక్కినందుకుగాను చిత్రనిర్మాణ సంస్థ తమ ఎక్స్ ద్వారా స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కాగా ఈసినిమాలో కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, విజయలక్ష్మీ, స్వరూప కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈసినిమాకు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: