కోలీవుడ్ విలక్షణ నటుడు, ‘మక్కళ్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మహారాజ’. సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. జూన్ 14న విడుదలైన మహారాజ తమిళంతో పాటు తెలుగులో సూపర్ హిట్ అయింది. తమిళనాడులో రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టి విజయ్ సేతుపతి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమా ఆయనకు సోలో హీరోగా తొలి 100 కోట్ల మూవీ కావడం గమనార్హం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా తన హవా కొనసాగిస్తూ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు మహారాజపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ చిత్ర దర్శకుడు నిథిలన్ స్వామినాథన్‌ను కలుసుకుని ప్రత్యేకంగా అభినందించాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా మూవీని మెచ్చుకున్నారు.
ఇదిలావుంటే, తాజాగా మరో స్టార్ హీరో ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. తమిళ అగ్ర నటుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా మహారాజాను వీక్షించారు. దర్శకుడి ప్రతిభకు అచ్చెరువొందిన ఆయన నిథిలన్ స్వామినాథన్‌ను తన ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించి సినిమా ఘనవిజయం సాధించడం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దర్శకుడు స్వామినాథన్ దీనిపై సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఈ సందర్భంగా సూపర్ స్టార్ తో దిగిన ఫోటోలను ఎక్స్ లో షేర్ చేసిన ఆయన ప్రత్యేక పోస్ట్ పెట్టాడు. అందులో.. “డియర్ సూపర్ స్టార్ రజనీకాంత్ సార్. మీతో ఈ అద్భుతమైన సమావేశానికి థ్యాంక్స్. మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడటం జీవితం గురించిన ఒక నవల చదివినట్లుగా అనిపించింది. మీ ఆతిథ్యం, వినయం చూసి నేను ఆశ్చర్యపోయాను. మీరు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. మహారాజా సినిమా మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది” అంటూ పేర్కొన్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: