టాలీవుడ్ టాప్ బ్యానర్ అయిన గీతా ఆర్స్ట్ పెద్ద సినిమాలే కాదు కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను కూడా నిర్మించడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు. ఇప్పటికే పలు చిన్న సినిమాలను నిర్మించి హిట్లను అందుకోగా ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నారు. నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆయ్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్, పాటలు అన్నీ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఆగష్ట్ 5వ తేదీన ఉదయం 11 గంటలకు 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. గొల్లప్రోలు పిఠాపురంలోని సత్యకృష్ణ కన్వెషన్ లో 11 గంటల నుండి ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: