పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్లో ఎంత సంచలనం సృష్టించిందో చూశాం కదా. ఇప్పుడు అందరి చూపు పుష్ప2పై పడింది. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు హిందీ ఆడియన్స్ ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ కాబట్టి సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉండటం కామన్. దానికి తగ్గట్టే మేకర్స్ ఎక్కడా తగ్గకుండా సినిమాను తీస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు అల్లు అర్జున్ వెకేషన్ కు వెళ్లడంపై కూడా పలు వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమా షూటింగ్ లేట్ అవ్వడానికి గల కారణం ఈసినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ అట. ఈసినిమాకు బల్క్ లో డేట్లు ఇవ్వకపోవడమే కారణమట. ఈసినిమా కోసం ఫహాద్ తను మలయాళంలో ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలను కూడా హోల్డ్ లో పెట్టాడట.. కానీ షూటింగ్ లేట్ అయింది.. దానికి తోడు రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది.. ఈ గ్యాప్ లో ఫహాద్ ఫాజిల్ తన మలయాళం సినిమాలతో బిజీ అయిపోవడంతో ఈ సినిమాకు డేట్స్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందట. దీంతోనే ఈసినిమా షూటింగ్ లేట్ అవుతుందని తెలుస్తుంది.
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: