టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్ ‘బేబి’ 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో చరిత్ర సృష్టించింది. యంగ్ హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ నిర్మించారు. తెలుగునాట యూత్‌ని విశేషంగా అలరించి బాక్సాఫీస్ వద్ద హ్యుజ్ సక్సెస్ అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ లోనూ దుమ్ము రేపింది. తాజాగా ఈ కల్ట్ బ్లాక్ బస్టర్ మరో హిస్టారిక్ ఫీట్ అందుకుంది. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్‌లో బేబి సినిమాకు 5 అవార్డ్స్ దక్కాయి. మొత్తం 8 నామినేషన్స్‌లో ఏకంగా 5 అవార్డ్స్ గెల్చుకోవడం గమనార్హం. దీంతో ఈ చిత్రం పేరు మరోసారి మారుమ్రోగిపోయింది. ఇక ఈ సినిమాతోపాటు మరో తెలుగు మూవీ ‘దసరా’ కూడా 6 అవార్డులను గెలుచుకోవడం విశేషం.
అయితే బేబి సినిమాకు ప్రేక్షకుల రివార్డ్స్‌తో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్స్ దక్కుతున్నాయంటే ఆ ఘనత ఈ ప్రేమ కథను హృద్యంగా తెరపై ఆవిష్కరించిన డైరెక్టర్ సాయి రాజేష్‌కే దక్కుతుంది. ఇక ఇదిలావుంటే, ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్, డైరెక్టర్ సాయి రాజేష్ కాంబినేషన్‌లో బాలీవుడ్‌లో బేబి సినిమా రీమేక్‌కు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి.
69వ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో బేబి గెలుచుకున్న పురస్కారాలు ఇవే..!
- బెస్ట్ ఫిల్మ్ – ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్
- బెస్ట్ యాక్ట్రెస్ – వైష్ణవి చైతన్య
- బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ – విజయ్ బుల్గానిన్
- బెస్ట్ లిరిసిస్ట్ – అనంత్ శ్రీరామ్ (ఓ రెండు మేఘాలిలా)
- బెస్ట్ సింగర్ – శ్రీరామ చంద్ర (ఓ రెండు మేఘాలిలా)
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: