యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి రాబోతున్న మోస్ట్ అవైడెట్ సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా, దేవర మొదటి భాగం సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుండగా.. షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక రిలీజ్ కు రెండు నెలలు టైమ్ ఉండగా ఇప్పుడిప్పుడే ప్రమోషన్లలో వేగం పెంచుతున్నారు. ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. మరోవైపు పాటలను కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఫియర్ సాంగ్ రిలీజ్ కాగా ఆ పాట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసిన సెకండ్ సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ అయితే వచ్చింది. సెకండ్ సింగిల్ ను ఆగష్ట్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపాారు. దీంతో ఈ పాట కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈసినిమా నుండి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా రెండు రాష్ట్రాల రిలీజ్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది. ఆ సంస్థ మరేదో కాదు సితార ఎంటర్ టైన్ మెంట్స్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈసినిమా రిలీజ్ హక్కులను సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు సొంతం చేసుకున్నట్టు నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.
కాగా కాగా ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా, సాబు సిరిల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: