తమిళ్ స్టార్ హీరో విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా తనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు విజయ్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా ది గోట్. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా సైలెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, రెండు పాటలు కూడా సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈసినిమా నుండి మరో అప్ డేట్ వచ్చింది. ఈసినిమా నుండి థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈపాట ప్రోమో ను రిలీజ్ చేసారు. ఇప్పుడు పుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
కాగా సినిమాలో స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: