టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఫియర్ సాంగ్ అయితే యూట్యూబ్‌లో మిలియన్లకుపైగా వ్యూస్ అందుకుని సెన్సేషన్ సృష్టించింది. త్వరలోనే సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దేవర సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది. ఈ సెకండ్ సింగిల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని పేర్కొన్నారు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి.
ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు. అందులో.. “తప్పనిసరి, సెంటిమెంటల్ పిక్, లొకేషన్ నుండి” అని సింపుల్‌గా చెప్పారు. అలాగే, “ఈ ట్వీట్ గుర్తుంచుకోండి.. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కారులో కూర్చుని ఆ పాటను రాస్తున్న ఫోటోను షేర్ చేసారు. కాగా ఈ పాటకు ఆయన సాహిత్యం అందిస్తుండటం గమనార్హం. ఇక ఈ పాట సినిమాలో సరైన టైమింగ్‍లో వస్తుందని, అలాగే చిత్ర గమనంలో కీలకంగా ఉండనుందని సమాచారం. శాస్త్రి గారి ట్వీట్ తర్వాత తారక్ అభిమానుల్లో సినిమాతోపాటు ఈ పాటపై కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి.
కాగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా, సాబు సిరిల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తీర ప్రాంతం నేపథ్యం, ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: